‎Bigg Boss: బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. ఆ తెలుగు సీరియల్‌ తో గుర్తింపు!

Bigg Boss: తెలుగులో ప్రసారమవుతున్న అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. తెలుగుతో పాటు ఇంకా చాలా బాషల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే 8 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు త్వరలో మరో కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అందులో బాగంగానే బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష అంటూ కంటెస్టెంట్ లను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే.

‎ ఈ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే రేసు నుంచి కొందరిని ఎలిమినేట్‌ కూడా చేశారు. కొందరిని హోల్డ్‌ లో పెట్టారు. కాగా మరికొందరిని నేరుగా టాప్‌ 15లోకి పంపించారు. వీళ్లంతా కామన్‌ ఆడియన్స్‌ విభాగంలో బిగ్‌బాస్‌9 లో  ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే, సెలబ్రిటీలు ఎవరు పాల్గొననున్నారు అనే అంశంలో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముద్ద మందారం సీరియల్‌ హీరోయిన్‌ బిగ్‌బాస్‌ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆమె పేరు ఫైనల్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రతి ఏడాది సీరియల్స్‌ లలో గుర్తింపు పొందిన వారిని తీసుకుంటారు.

‎ముఖ్యంగా కన్నడకు చెందిన అమ్మాయిలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారన్న తెలిసిందే. కర్ణాటకకు చెందిన శోభా శెట్టి, యష్మి గౌడ, నిఖిల్ వంటి వారు బాగా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు సీజన్‌ 9లోకి ముద్ద మందారం సీరియల్‌ లో  పార్వతి పాత్రతో మెప్పించిన తనూజా గౌడ ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయిందట. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకుందట. కన్నడకు చెందిన తనుజా గౌడ కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఎక్కువగా సీరియల్స్‌ లోనే నటించింది. దాదాపు 5 సంవత్సరాలు ప్రసారమైన ముద్ద మందారంతో ఆమెకు తెలుగులో బాగా పాపులారీటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాగ భైరవి సీరియల్‌ లోనూ నటించింది. మరి ఈ విషయం లో నిజా నిజాల గురించి తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.