Shirisha: సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నటి శిరీష!

Shirisha: తనకు ఇప్పుడు అవకాశాలు ఇస్తాము కమిట్ అవుతా అంటే అవుతానని అంటుంది ప్రముఖ నటి శిరీష క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలుగు గురించి మాట్లాడే ఆమె ఎలా అవుతారు అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. అడిగే వాళ్లకు లేని సిగ్గు తనకు ఎందుకని, అసలు తెలుగు వాళ్ళని అలా అడగకూడదని వాళ్ళకే ఉండాలి కదా అని ఆమె అన్నారు. ఇప్పటికే తాను కమిట్ అయ్యానని ఆమె స్పష్టం చేశారు. అవకాశాల కోసమే కదా తాను సినీ ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసం ఏమైనా చేస్తామని ఆమె అన్నారు.

ఇక క్యాస్టింగ్ కౌచ్ పై తాను చేస్తున్న పోరాటం గురించి మాట్లాడుతూ శిరీష అనే అమ్మాయి పడిన కష్టం ఇబ్బంది వేరొక అమ్మాయి పడకూడదని ఆ పోరాటం చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఇండస్ట్రీ మొత్తాన్ని కించపరిచడం లేదని కొందరు డైరెక్టర్లు తనని డైరెక్టుగా సెట్ కి పిలిచి అవకాశం ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. కానీ రాక్షసులు ఎక్కువై దేవుళ్ళు కనుమరుగై పోతున్నారు ఇండస్ట్రీలో అని ఆమె ఓ స్టేట్మెంట్ ని వదిలారు.

తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వస్తే ఇలా ఉంటుంది అని తాను చెప్పలేదని శిరీష అన్నారు. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే వాళ్లకి ఇక్కడ సందర్భం అర్థమవుతుందని అప్పుడు వాళ్ల సపోర్ట్ గా ఎవరైనా వస్తే ప్రాబ్లెమ్ ఉండదని ఆమె చెప్పారు. ఉదాహరణకు తాను ఇల్లు రెంటుకు కావాలని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చాను అనే ఒకే ఒక్క కారణంతో తనకు రెంటుకు ఇవ్వడం లేదని ఆమె చెప్పారు అందుకు కారణం ఇండస్ట్రీపై నా బ్యాడ్ టాక్ ఉండడం వల్లనే అని ఆమె స్పష్టం చేశారు.