అవి దాచి పెట్టి ఉంటే మనశ్శాంతి కరువయ్యేది: రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగా ఇంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అప్పుడప్పుడు టూరిజం ప్లేస్ ను సందర్శిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తానే స్వయంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ వ్యవహారం గురించి ప్రేమలో ఉండటం చాలా సహజమైన విషయం అని.. ప్రేమ గురించి దాచి పెట్టాల్సిన అవసరం కానీ ఏవేవో ఊహాగానాలు ఊహించుకోవడం కానీ తనకు ఇష్టం లేదని తెలిపింది.

అందుకే తాను ప్రేమలో పడిన తొలి రోజుల్లోనే ఎటువంటి దాపరికం లేకుండా తన ప్రేమ విషయం గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకొని అందరికీ చెప్పేసాను అని తెలిపింది. తన ప్రేమ వ్యవహారం గురించి అందరితో పంచుకోవడమే మంచిదయింది అని, ఒకవేళ ప్రేమ వ్యవహారం ని దాచి పెట్టి ఉంటే మీడియాలో వచ్చే రకరకాల కథనాలతో మనశ్శాంతి కరువయ్యేది అంటూ అసలు విషయం బయట పెట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్.