తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చిన నటి మీరా చోప్రా.. పెళ్లే ఎప్పుడంటే?

వాన, బంగారం వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమె తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు . ఈ సినిమాల ద్వారా ఈమెకు చెప్పుకోదగ్గ గుర్తింపు కూడా లభించలేదు. తెలుగు, తమిళ, కన్నడ వంటి పలు భాషల్లోని చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫోటోలు, వీడియోలు సోషియల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మీరా చోప్రా నటిగా కన్నా కాంట్రవర్సీ లతోనే బాగా ఫేమస్ అయింది.

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద విరుచుకుపడుతూ విమర్శలు చేస్తూ ఉంటుంది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె మీద బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద కేసులు కూడా పెట్టింది. ఇప్పటికీ మీరాచోప్రా తెలుగు హీరోల మీద అప్పుడప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీరాచోప్రా ఇటీవల #ASKMEERA అంటూ హంగామా చేసింది. దీంతో నెటిజన్లు అడిగిన పలు రకాల ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో నాకు ఐ లవ్ యూ చెప్పండి అంటూ ఒక నెటిజన్ అడగగా ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఐ లవ్ యూ అని చెప్పింది. ఈ సందర్భంగా మరొక నెటిజన్ మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? లేదా జీవితాంతం సింగిల్ గానే ఉంటారా? అని అడిగాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ఈ సంవత్సరమే అని మీరా సమధానం చెప్పింది. ఎట్టకేలకు ఈ ఏడాది మీరా చోప్రా పెళ్లిపీటలు ఎక్కనుందని తెలుస్తోంది.