Actor Srikanth: నేరం అంగీకరించిన హీరో శ్రీకాంత్.. డ్రగ్స్ వాడి తప్పు చేశాను అంటూ!

Actor Srikanth: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కోలీవుడ్ నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. కొంతమంది డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్టు చేసి విచారిస్తున్న సమయంలో హీరో శ్రీరామ్ పేరు కూడా బయటపడటంతో అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మత్తు పదార్థాలకు కేసులో తమిళనాడు పోలీసులు తాజాగా సోమవారం రోజు ఆయనను అరెస్టు చేశారు. అంతేకాకుండా హీరో శ్రీరామ్ పై మూడు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు.

నిన్న అనగా మంగళవారం రోజు శ్రీరామ్ ఎగ్మూర్‌ కోర్టులో హాజరు పరచగా జులై 7 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో హీరో శ్రీరామ్ స్పందిస్తూ.. మత్తు పదార్థాలు వాడి తప్పు చేశాను. నా కుమారుడిని చూసుకోవాల్సి ఉంది. అందుకు బెయిల్‌ మంజూరు చేయండి అంటూ న్యాయమూర్తి వద్ద శ్రీరామ్‌ విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. నార్కొటిక్స్‌ కేసులు విచారించే ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీరామ్‌ ను పుళల్‌ జైలుకు తరలించారు. మరోవైపు అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌ నాకు మత్తుపదార్థాలను అలవాటు చేశారు.

ఆయన నిర్మాణంలో తీంగిరై అనే సినిమాలో నేను నటించాను. అప్పుడు ఆయన నాకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నగదు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్‌ ఇచ్చేవారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి నేనే అడిగే పరిస్థితి ఏర్పడింది అని పోలీసులకు శ్రీరామ్‌ వెల్లడించారు. అలా అతను డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వడానికి కారణం ప్రసాద్ అని పోలీసుల ముందు తెలిపారు హీరో శ్రీరామ్. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.