Drugs Case: ఇటీవల మత్తు పదార్థాల కేసులో కోలీవుడ్ నటుడు శ్రీరామ్, కృష్ణలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మిగతా ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. మాదకద్రవ్యాలను వాడిన కేసులో నటుడు శ్రీరామ్ తమిళంలో శ్రీకాంత్ నీ పోలీసులు అరెస్టు చేసి గత నెల 23వ తేదీన జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అదే కేసులో మరో నటుడు కృష్ణను కూడా గత నెల 26వ తేదీన అరెస్ట్ చేసారు. అయితే పోలీసుల విచారణలో తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కానీ ఊహించని విధంగా కోర్టు వీరి బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయ వాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్ పూర్తి చేసిన జైలు అధికారులు నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు. అయితే డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఒప్పుకున్నారు.
అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. ఒక సినిమా విషయంలో తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు వెళ్లినప్పుడే తనకు తెలియకుండానే ఇలా మత్తు పదార్థాలు ఎన్నిసార్లు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు శ్రీరామ్. అలా అతను రెండు సార్లు అలవాటు చేయడంతో మూడవసారి అడిగే పరిస్థితి వచ్చిందని ఆ సమయంలోనే ఇలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు.
