Jagapathi Babu: ఎన్టీఆర్, ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతి బాబు?

Jagapathi Babu: జగపతి బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలలో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలో నటిస్తూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా సినిమాలోని తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయినా అఖండ, హీరో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలతో వరుసగా హిట్ టాక్ లను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోలు అయినా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లతో పాటు ఇతర హీరోల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ బంగారం అని, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి ప్రభాస్ అని చెప్పుకొచ్చారు జగపతిబాబు. హీరో మహేష్ బాబు కూడా అందరితో సరదాగా ఉంటారని తెలిపాడు. మహేష్ బాబు ఎక్కువగా సెటైర్లు వేస్తూ నవ్విస్తూ ఉంటారని తాను కూడా మహేష్ బాబుతో రెండు సినిమాల్లో కలిసి నటించారు అని చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ ఒక పెద్ద కోతి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా అల్లరి తగ్గించాడు అని చెప్పుకొచ్చారు జగపతి బాబు. ఎన్టీఆర్ ఎక్కువగా గోల గోల చేస్తూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటాడని గతంతో పోలిస్తే కొంచెం మెచ్యూర్ అయ్యాడని జగపతిబాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని ఎలా ఉండాలి అనుకున్నానో అదే విధంగా ఉన్నాను అని జగపతిబాబు తెలిపారు. టాలీవుడ్ లో నాకు ఇష్టమైన హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. తన లుక్ విషయంలో బన్నీ ఎంతగానో ఆకట్టుకుంటారు అని జగపతిబాబు తెలిపారు.