Fish Venkat: టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే డయాలసిస్ చేయించుకుంటూ ఇన్ని రోజులు కాలం వెళ్లదీసిన ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని బి.ఆర్.ఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈయన వెంటిలేటర్ పై ఉండి చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో కాస్త తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఇతరుల సహాయంతో లేచి కూర్చునే పరిస్థితికి వచ్చారని ఇదివరకు వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
ఇకపోతే తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు మరొక హాస్పిటల్ కి తరలించినట్టు తెలుస్తుంది. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించడంతో అందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య కుమార్తె ఎవరైనా సహాయం చేయాలని కోరుకున్నారు.
దీన పరిస్థితులలో ఫిష్ వెంకట్ ఉన్నప్పటికీ టాలీవుడ్ హీరోలు మాత్రం ఎవరు ఆయనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇటీవల ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న నటుడు విశ్వక్ సేన్ రెండు లక్షల రూపాయల చెక్కు అందించిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ కూడా కొంతమేర ఆర్థిక సహాయం అందజేశారు. ఇక తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఫిష్ వెంకట్ ని హాస్పిటల్ లో కలిసి ఆయనని పరామర్శించారు అలాగే తన చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వం చూసుకుంటుందని అభయమిచ్చారు.
ఇలా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మంత్రులు ఎమ్మెల్యేలు యూట్యూబర్స్ స్పందిస్తున్నప్పటికీ ఇప్పటివరకు తెలుగు హీరోలు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా తెలుగు హీరోలు మనసు కరిగి ఫిష్ వెంకట్ కు అండగాలని నిలిస్తే బాగుంటుందని పలువురు సినీ ప్రేక్షకులు, హీరోలను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
