ఈఎస్ ఐ స్కామ్ లో ఇప్పటివరకూ 12 మంది అరెస్ట్ అయ్యారు. ఏడుగురు పరారీలో ఉన్నారు. వీళ్ల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ అదుపులోకి తీసుకోమని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి పితాని కుమారుడు స్కామ్ లో కీలక భాగస్వామిగా ఉన్నట్లు ఇప్పటికే తేలింది. ఏసీబీ అధికారులు తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తున్నాయి. అందుకే వీళ్లంతా పరారీలో ఉన్నారు అన్నది అంతే వాస్తవం. రెట్టింపు ధరలకు మందులు కొనుగోళ్లు చేయడం, వైద్య పరికరాలపై దొంగ బిల్లులు చూపించి డబ్బులు నొక్కేయడం, ఆ డబ్బు కోసం వాళ్లలో వాళ్లే కుమ్ములాడుకోవడం, కంపెనీలకు నకిలీ లెటర్ హెడ్స్ తో టెంటర్లు ఇవ్వడం సహా అప్పటి ప్రభుత్వంలో పెద్ద అవినీతే జరిగింది.
975 కోట్లు నిధులు కేటాయిస్తే 150 కోట్లు చేతులు మారాయి. 100 రూలు కూడా విలువ చేయని మందులను రెట్టింపు ధర 200 రూలకు కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు చూపించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి లక్ష రూపాయలకు మించి పరికరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాలంటే ఆర్ధిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ నాటి ప్రభుత్వం ఈ నిబంద్ధనలన్నింటిని తుంగలోకి తొక్కి పాతరేసింది. ఈప్రోక్యుర్ మెంట్ ద్వారా టెండర్లు పిలవాల్సి ఉండగా, లిమిటెడ్ టెండర్ల పేరిట కొత్త విధానాన్ని నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరో వైపు ఊరు పేరు లేని కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి.
ఇలా ఏసీబీ తవ్వే కొద్ది విస్తుపోయే వాస్తవాలు బటయ పడ్డాయి. అచ్చెన్నాయుడు విచారణలో భాగంగా అవాస్తవాలు తప్ప ఒక్క వాస్తవం కూడా చెప్పలేదని ఏసీబీ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆయన్ని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. అక్రమ సొమ్ము ఎక్కడా బయటపడలేదు. లిక్విడ్ క్యాష్ రూపంలో ఒక్క రూపాయి కూడా దొరకలేదు. అంతా పక్కా పకడ్భందీగా ప్లాన్ చేసి స్కామ్ చేసారు. దొంగ బిల్లులు చూపించడం, రూపాయి ఖర్చు దగ్గర రెండు రూపాయలు ఖర్చు చూపించడం వంటి అధారాలు ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నాయి. కానీ పచ్చ మీడియా ఇలాంటి వాస్తవాల్ని దాచిపెట్టి తమకు అనుకూలమైన కథనాలను ప్రసారం చేస్తోంది. ఇందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బ్యాడ్ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని వైకాపా వర్గం మండిపడుతోంది.