కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీఎంలను, ఖర్గే ను అరెస్టు చేసి విడుదల చేసిన పోలీసులు..

ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పార్టీ శ్రేణులు పలుచోట్ల నిరసనలు కూడా దిగారు. ఆయనను ఎంతసేపు విచారిస్తారో.. అంత సేపు ఈడీ కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని తీర్మానించింది.

దీంతో మధ్యాహ్నం సమయంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీఎంలు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాగేల్ (చతిస్గడ్) లను అరెస్టు చేశారు. అంతేకాకుండా రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్లు వేణుగోపాల తో సహా మరికొంతమంది ఆ పార్టీ నేతలను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని విడుదల కూడా చేశారు. దీంతో తమ పార్టీ నేతలపై అలా ప్రవర్తిస్తారు అని కాంగ్రెస్ నేతలు పోలీసులపై మండిపడ్డారు.