Acharya Trailer Launch : ధియేటర్స్ లో “ఆచార్య” ట్రైలర్ రిలీజ్ కి సాలీడ్ ప్లానింగ్..లిస్ట్ వచ్చేసింది చూసారా?

Acharya Trailer Launch : టాలీవుడ్ నుంచి వస్తున్న మరో గ్రాండ్ మల్టీస్టారర్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్ లుగా ఈ సినిమాలో నటించారు.
అయితే అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం మొదటగా ట్రైలర్ బ్లాస్ట్ ని రిలీస్ చేస్తున్నట్టు ఈ ఏప్రిల్ 12 ని ఫిక్స్ చేశారు.
అయితే మొబైల్ మరియు ఇంటర్నెట్ వెర్షన్ కి టైం ఖరారు చెయ్యలేదు కానీ మెగా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఈ సినిమా ట్రైలర్ ని అదే రోజున థియేటర్ లలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
మరి ఎక్కడెక్కడ ఎన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు అనేది వెల్లడి చేస్తామని ఇప్పుడు ఫైనల్ గా ఈ లిస్ట్ ని అనౌన్స్ చేసేసారు. అయితే దీనికి అదిరే ప్లాన్ చేసారని చెప్పాలి.
ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమా కాగా ఈ సినిమా ట్రైలర్ ని అదే 152 థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు ఏపీ మరియు తెలంగాణ లలో ఏరియాల వారీగా విడుదల చేసారు.
దాదాపు అన్ని మెయిన్ సెంటర్స్ ని టార్గెట్ చేసి రిలీజ్ ప్లాన్ చేసిన లిస్ట్ లో మీ దగ్గర ఏరియా కూడా ఉండవచ్చు ఆ లిస్ట్ లో మీరు చూసి తెలుసుకోవచ్చు. మరి ఈ భారీ మల్టీస్టారర్ ని దర్శకుడు కొరటాల శివ డీల్ చెయ్యగా సోను సూద్ కీలక పాత్రలో నటించారు.
అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా కొణిదెల ప్రొడక్షన్ హౌస్ వారు ప్రెజెంట్ చేశారు.
https://twitter.com/KonidelaPro/status/1513415186698289153?t=wZG7tEDyqogGLVYFjv_wnQ&s=19