వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఎక్కడ ఉండాలి.. వంటగదిలో పెట్టకూడని వస్తువు ఇదే?

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. మనం చేసే ప్రతి పనిలోనూ వాస్తును బట్టి ఆ పనులను చేస్తుంటాము. ముఖ్యంగా ఇంటి నిర్మాణం చేస్తే సమయంలో వంటగది నిర్మించడం కోసం తప్పనిసరిగా వాస్తు శాస్త్రాన్ని చూస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వంటగది ఏ దిశలో ఉండాలి వంట గదిలో ఏ వస్తువు ఉండకూడదనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మన ఇంటికి వంటగది ఎంతో ప్రధానమైనది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీతో అనుగుణంగా వంటగదిని కూడా ఎంతో స్మార్ట్ గా నిర్మించుకుంటున్నారు. అయితే వంటగది నిర్మించుకునే సమయంలో వాస్తు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది లేదంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటామని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ప్రతి ఒక్క ఇంటిలోనూ వంటగది వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశలో ఉండాలి. ఈ దిశ కాకపోతే వంటగది వాయువ్య దిశలో ఉండాలి.

ఇకపోతే వంటగది తూర్పు వైపు ఉంటే వంట గది పది నుంచి 11 అడుగుల ఎత్తులో ఉండాలి మరి వంటగది ఎత్తు తక్కువగా ఉంటే ఆ ప్రభావం మహిళల ఆరోగ్యం పై పడే అవకాశం ఉంది. ఇకపోతే వంట గదిలో సింక్ ఉత్తరం వైపు, స్టౌ ఆగ్నేయ దిశలో ఉండాలి.ఇకపోతే వంట గదిలో ఎప్పుడు కూడా పెట్టకూడని వస్తువులలో చీపురు ఒకటి. చీపురుని ఎట్టి పరిస్థితులలో కూడా వంట గదిలో పెట్టకూడదు.ఇలా వంటగదిలో చీపురు పెట్టడం వల్ల కుటుంబంలో అనారోగ్య సమస్యలు వెంటాడడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అందుకే చీపురుని ఎట్టి పరిస్థితులలో కూడా వంట గదిలో పెట్టకూడదు.