సాధారణంగా మనం మన ఇంటి ఆవరణంలో ఎన్నో రకాల మొక్కలు చెట్లను పెంచుకుంటూ ఉంటాము. అయితే వాస్తు పరంగా కొన్ని రకాల మొక్కలు, చెట్లు మన ఇంట్లో ఉండటం వల్లమన ఇంటి ఆర్థిక పరిస్థితి దినదినాభివృద్ధి చెందుతుందని అలాగే మన ఇంటి పైకి ఏ విధమైనటువంటి చెడు ప్రభావం కూడా ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది.నాటడం వల్ల ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంటాయి. ఈ క్రమంలోనే మన ఇంటి ఆవరణంలో కొన్ని రకాల చెట్లు ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది మరి ఆ మొక్కలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ఆవరణంలో వేపచెట్టు ఉండటం ఎంతో మంచిది వేపు చెట్టు ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ వేప చెట్టును మన ఇంటి వాయువ్య దిశలో నాటడం ఎంతో మంచిది. అలాగే ఇంటి ఆవరణంలో స్నేక్ ప్లాంట్ ఉండటం ఎంతో మంచిది. ఇక ఈ మొక్కను చిన్న కుండీలలో నాటుకొని పిల్లలు చదువుకునే చోట లేదా బెడ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. వాస్తు పరంగా స్నేక్ ప్లాంట్ ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో కొబ్బరి చెట్టు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటి ఆవరణంలో కొబ్బరి మొక్క ఉండటం వల్ల ఆర్థిక ఎదుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మన ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటడం ఎంతో శుభ సూచకం తులసి మొక్క నాటి ప్రతిరోజు నీళ్ళు పోయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటాయి.