వాస్తు శాస్త్రం ప్రకారం పూజ చేస్తున్న సమయంలో దీపాలను ఎలా వెలిగించాలో తెలుసా?

సాధారణంగా మనం ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉండి మనకు ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సకల సంపదలు కలిగించాలని నిత్యం పూజలు చేస్తూ భగవంతుడిని ప్రార్థిస్తుంటాము. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూజ చేసి దీపారాధన చేస్తాము అయితే ఈ దీపారాధన చేసే సమయంలో కొన్ని వాస్తు పద్ధతులను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. సాధారణంగా మనం ఇత్తడి లేదా మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తూ ఉంటాము. ఇలా దీపాలను వెలిగించడం వల్ల మన జీవితంలో కమ్ముకున్న చీకట్లు తొలగిపోతాయని ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మనతో ఉంటాయని భావిస్తారు.

ఇలా పూజ చేసిన తర్వాత దీపాలను వెలిగించడానికి అష్టలక్ష్మిలు ఉన్నటువంటి దీపం లేదా అష్టలక్ష్మిలు కలిగినటువంటి కలశాన్ని పూజ చేసే సమయంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అష్ట లక్ష్మి అంటే ఆది, ధాన్య, వీర, గజ, సంతాన, విద్య, విజయ, ధనలక్ష్ములనే అష్టలక్ష్మిలు అంటారు. ఇలా అష్టలక్ష్మిలు కలిగి ఉన్నటువంటి కలశం పెట్టుకోవడం లేదా అష్టలక్ష్మిలు ఉన్నటువంటి దీపపుకుందెను ఉపయోగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

ఇలా అష్టలక్ష్ములు ఉన్నటువంటి దీపపు కుందలను ఉపయోగించడం వల్ల ధనంతో పాటు జ్ఞానం, బుద్ధి, సంపద కూడా మెరుగుపడుతుంది. ఇలా దీపారాధన చేసిన అనంతరం ఇంట్లో ధూపం వేయాలి. ఇలా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇలా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటిలో దీపారాధన చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది.