రేవంత్‌రెడ్డికి షాకిచ్చిన ఏసీబీ కోర్టు .. ఏమైందంటే !

Congress senior leaders competing with Revanth Reddy 

ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురయింది. ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్‌ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలు ఇస్తూ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.