సీఎం జగన్ పరిపాలన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. పరిపాలన పరంగా పెద్దగా అనుభవం లేకపోయిన కానీ అతి తక్కువ కాలంలోనే ప్రజా సంక్షేమ పాలన విషయంలో మంచి మార్కులు తెచ్చుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. రాష్ట్ర పరిస్థితుల మీద, అభివృద్ధి మీద సీఎం జగన్ కు ఒక సృష్టమైన అవగాహనా ఉండటంతోనే ఇది సాధ్యం అయ్యింది. తాజాగా జరిగిన ఒక చిన్న సంఘటన చాలు జగన్ యొక్క విజన్ ఎలా ఉంటుందో తెలపటానికి
నిన్న అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలోని మైనారిటీ సంఘాలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్ అన్నను లైన్ లోకి తీసుకోండని చెప్పాడు. దీనితో లైన్ లోకి వచ్చిన ఇంతియాజ్ తో అన్న ఏమైనా మాట్లాడాలా అంటూ జగన్ అడగటంతో మైనారిటీ నేతలు మీతో మాట్లాడుతారు అంటూ చెప్పటంతో జగన్ సరే అన్నాడు. ఈ సందర్భంగా ముస్లిమ్ నేతలు మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ముస్లిమ్ విద్యార్థులకు గతంలో ప్రభుత్వం సహాయం చేసేది , కానీ ఇప్పుడు దానిని ఆపేశారు , మీరు దాని గురించి అలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
దీనితో జగన్ మాట్లాడుతూ ఒక విద్యార్థి విదేశాలు వెళ్లి చదువుకోవటానికి పెట్టె ఖర్చుతో ఇక్కడ 20 మంది విద్యార్థులను మంచి వసతులతో చదివించవచ్చు, ఒక వేళా విదేశాల్లో ఉన్న టాప్ 100 యూనివర్సిటీలో సీటు వస్తే ఖచ్చితంగా సహాయం చేయవచ్చు, అలా కాకుండా ఎదో ఒక యూనివర్సిటీలో చేరటం అందుకు సహాయం చేయటం కరెక్ట్ కాదు, దేశం కానీ దేశంలో టాప్ 100 యూనివర్సిటీలో సీటు సంపాదిస్తే అది చాలా గొప్ప విషయం, అలాంటి వారికీ తప్పకుండా సహాయం చేస్తామని క్లారిటీగా చెప్పాడు.
ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ కు ఉన్న విజన్ ఏమిటో చెప్పటానికి, అదే సమయంలో తనకంటే వయస్సులో పెద్దవాళ్ళను పదవులతో సంబంధం లేకుండా ఎంతో ప్రేమగా అన్న అనటం జగన్ యొక్క సంస్కారానికి నిదర్శనం. ఇలాంటి నేతనే కదా రాష్ట్ర ప్రజలు కోరుకునేది. విజన్ అంటే నాదే .. విజన్ 2020 అంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు కూడా జగన్ ముందు చూపుకి జగన్ యొక్క విజన్ కు సలామ్ చేయాల్సిందే