Arya 3: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ఆర్య. ఈ సినిమా ఇటు సుకుమార్, అటు అల్లు అర్జున్ కు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయని చెప్పాలి. ఈ చిత్రం సుకుమార్ కు మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా హీరోగా నిలదొక్కుకున్నారు.
ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఆర్య 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ రెండు సినిమాలకు కథపరంగా ఎక్కడ లింక్ లేకపోయినప్పటికీ ప్రేక్షకులను అల్లరించింది. ఇదిలా ఉండగా తాజాగా ఆర్య 3 గురించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే నిర్మాత దిల్ రాజు ఆర్య 3 పేరుతో ఫిలిం ఛాంబర్ లో టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఈ సినిమా అతి త్వరలోనే పట్టాల పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ పాన్ వరల్డ్ స్థాయిలో మార్మోగిపోతుంది ఇలాంటి తరుణంలో ఈయన ప్రేమ కథ చిత్రాలలో నటించి తన మార్కెట్ తానే తగ్గించుకోలేరు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఆర్య 3 సినిమాలో నటించే అవకాశాలు ఏమాత్రం లేవు అందుకే ఈ సినిమాలో హీరోగా నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆశిష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆశిష్ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయారు.
ఇలాంటి తరుణంలోనే ఆర్య 3 వంటి లవ్ స్టోరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇలా ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటించబోతున్నారనే విషయం తెలియగానే అల్లు అర్జున్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ… అల్లు అర్జున్ ఈ రెండు సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఆశిష్ హీరోగా నటిస్తూ సినిమా పరువు తీయరు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.