Aamir khan: ఆ ఫోటోలను ఉపయోగించి ట్రోల్స్ ఎలా చేస్తారు.. మండిపడిన అమీర్ ఖాన్.. అసలేం జరిగిందంటే!

Aamir khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమీర్ ఖాన్ ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఈయన కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలలో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తరచూ ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉన్నారు అమీర్ ఖాన్. అందులో భాగంగానే తాజాగా మరోసారి ఆయన పేరు వైరల్ గా మారింది. తన ఫోటోలను ట్రోల్స్ చేయడం పైట్ల ఆయన స్పందిస్తూ మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే.. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో తాను కలిసి దిగిన ఒక పాత ఫొటో ఇటీవల వైరల్‌
అయిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తుర్కియే ఆ విధంగా చేయడం సరికాదు. ఆ దేశ తీరుపట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహానికి గురయ్యాడు. కొన్నేళ్ల క్రితం తుర్కియేలో భారీ భూకంపం వచ్చింది. కష్ట సమయంలో ఆ దేశానికి సాయం చేయడంలో భారత్‌ ముందు ఉంది. సుమారు ఏడేళ్ల తర్వాత ఎర్డోగాన్‌ ఇలా వ్యవహరించడం సరికాదు. ఒక నటుడిగా మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర దేశాలకు వెళ్తుంటాను. అక్కడి వారితో ఫొటోలు దిగుతుంటాను.

ఆ నాటి ఫోటోలను ఉపయోగించి ఇప్పుడు ఎలా ట్రోల్‌ చేస్తారు? తుర్కియే అధ్యక్షుడు ఈ విధంగా చేస్తారని 2017లో నాకు తెలియదు కదా అని అమీర్‌ ఖాన్‌ అన్నారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు అమీర్ ఖాన్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు అమీర్ ఖాన్ పై ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ కు సాయం చేసిన తుర్కియేపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వస్తువుల దిగుమతి నిలిపివేయాలంటూ బాయ్‌కాట్‌ తుర్కియే నినాదంతో సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తో ఆమిర్‌ కలిసి దిగిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఇప్పుడు అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.