తన లవ్ స్టోరీ బయటపెట్టిన ఆది.. 11 ఏళ్లుగా ఆది ప్రేమించిన అమ్మయి ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి, అబ్బాయి కొంచెం క్లోజ్ గా కలిసి తిరిగితే చాలు వారి గురించి ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇలాగే కమెడియన్ హైపర్ ఆది ప్రేమా,పెళ్లి గురించి రక రకాలుగా యూట్యూబ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో యాంకర్ వర్షిణి తో ఆది పెళ్ళి జరిగినట్టు యూట్యూబ్ లో వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ సమయంలో వర్షిణి షేర్ చేసిన ఫోటోలు, పోస్టు వల్ల ఈ వార్తలు నిజమని చాలామంది నమ్మారు. కానీ కొంతకాలానికి వారిద్దరికీ పెళ్ళి జరగలేదని అందరికీ తెలిసిపోయింది.

ఇక తాజాగా హైపర్ ఆది లవ్ స్టొరీ గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆది తన లవ్ స్టొరీ గురించి చెప్పుకొచ్చాడు. అసలు విషయానికి వస్తే .. ఆది ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో సందడి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వారం ప్రసరం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమోలో శ్రీదేవి డ్రామా కంపెనీ 75వ ఎపిసోడ్ జరుపుకుంటున్న సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా చావ్లా ఈ షో కి గెస్ట్ గా హాజరైంది. ఈ క్రమంలో ఇషా చావ్లా మీదున్న ప్రేమని ఆది బయట పెట్టాడు.

ప్రేమ కావాలి సినిమా వచ్చి 11ఏళ్లు అవుతుంది. అప్పటినుండి నిన్ను ప్రేమిస్తున్నా అంటూ ఆది తన ప్రేమని బయట పెట్టాడు. ఈ క్రమంలో 11 ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నీకు 11 గిఫ్ట్స్ ఇస్తున్నాను అని 11 గిఫ్ట్స్ ఇచ్చాడు. అంతే కాకుండా రష్మి, సుధీర్ ని ఇమిటేట్ చేస్తూ.. నువ్వు ఏడిస్తే చచ్చిపోతా.. చచ్చిపోతే గుంతలో పూడుస్తా అని అందరిలాగా డైలాగ్స్ చెప్పటం రాదు అని అంటాడు. తర్వాత అర్దరాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేశాడు.. నా కోసం గోడ దూకాడు అనేవి కూడా నాకు చెప్పడం రాదంటూ వర్ష ఇమాన్యుయల్ మీద సెటైర్లు వేసాడు. అది ఇలా టీఆర్పీ కోసం ఇలా లవ్ స్టొరీ అని చెప్పాడు.. అంతే కానీ తన జీవితంలో ఉన్న నిజమైన లవ్ స్టొరీ మాత్రం బయటపెట్టడం లేదు.