రామ్ కి విలన్ గా ‘సరైనోడు’ దొరికాడు

Aadhi pinisetty selected as villain in ram pothineni and linguswamy movie

యువ నటుడు ఆది పినిశెట్టి… ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూ మరోవైపు విలన్ గా,సహాయ నటుడుగా నటిస్తూ అభిమానులని అలరిస్తున్నాడు. ఎప్పుడూ ఒకేతరహా పాత్రలలో నటించటం ఇష్టముండదని… చాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తానని ఆది ఎప్పుడూ చెబుతుంటాడు. సరైనోడు, అజ్ఞాతవాసి, నిన్ను కోరి, రంగస్థలం, నీవెవరో,యు టర్న్ సినిమాలలో పోషించిన పాత్రలను బట్టి అతను అభిరుచిని అర్థంచేసుకోవచ్చు. అయితే ఆది మరోసారి విలన్ గా అలరించబోతున్నాడని సమాచారం.

హీరో రామ్, త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి కాంబినేష‌న్‌లో బైలింగ్యువ‌ల్ మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టిని విలన్ గా తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అదిరిపోయే కాంబినేష‌న్‌ తో సినిమా మీద విపరీతమైన హైప్ వచ్చేసింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మేకర్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ… ఆనందంగా ఉందని ఆది పేర్కొన్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి రామ్ సరసన నటిస్తుండగా రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.