AAA: విశాఖలో అల్లు అర్జున్‌ మల్టీఫ్లెక్స్‌ పనులకు శ్రీకారం.. ఫోటోస్ వైరల్!

AAA: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. కాగా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో నిర్మించి వాటి ద్వారా బాగానే సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రదేశాలలో ఏసియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లు నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్వరలోనే విశాఖపట్నంలో మరో కొత్త మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది..

ఆ వివరాల్లోకి వెళితే..విశాఖపట్నంలోని ఇనార్బిట్‌ మాల్‌ కొద్దిరోజుల్లో ఓపెన్‌ కానుంది. విశాఖ నగరానికి సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్ కానుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆ యాజమాన్యం చకచకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ అల్లు అర్జున్ మల్టీ ప్లెక్స్ పనులు తాజాగా ప్రారంభించారు. 2023లోనే 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి పునాది పడింది. దక్షిణాదిలోనే విశాఖలో నిర్మించే మాల్‌ అతిపెద్దది. తాజాగా జులై 10న ఆసియన్ సునీల్, అల్లు అరవింద్‌లతో పాటు వారి టీమ్‌ విశాఖపట్నం చేరుకుంది. ఇనార్బిట్‌ మాల్‌లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పది నెలల్లోనే పనులు మొత్తం పూర్తికావాలని ప్రణాళికలు వేశారు.

ఇప్పటికే థియేటర్‌ లో ఉండాల్సిన ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్‌ ఫైనల్‌ చేశారట. మల్టీ ప్లెక్స్‌ కు కావాల్సిన ఫర్నీచర్‌ అంతా విదేశాల నుంచే తెప్పిస్తున్నారట. విశాఖలోనే అత్యంత లగ్జరీ థియేటర్‌గా ఉండాలని వారు ప్లాన్‌ చేస్తున్నారట. దాదాపుగా మొత్తం 8 స్క్రీన్స్‌ ఈ మల్టీఫ్లెక్స్‌ ఇందులో ఉంటాయట. ఇది వచ్చే ఏడాది 2026 సమ్మర్‌ లో ప్రారంభం కానుందని ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లిలో అల్లు అర్జున్‌ కు ఒక మల్టీఫ్లెక్స్‌ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో కోకాపేట వద్ద మరోకటి కూడా వారు నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పుడు వాటికంటే కొంచెం పెద్దదైన మల్టీప్లెక్స్ నీ నిర్మిస్తున్నారు.