దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నయనతార ఎట్టకేలకు తన ప్రియుడితో జూన్ 9వ తేదీ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే నయనతార తన పెళ్ళికి పలువురు సినీ సెలబ్రిటీలను ఆహ్వానించారు. అయితే తనతో పాటు పనిచేసిన తన కో స్టార్స్ కూడా తన పెళ్లికి హాజరయ్యారు అని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నయనతార బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం జవాన్. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ సైతం నయనతార పెళ్లికి ముంబై నుంచి మహాబలిపురం చేరుకున్నారు.
ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ నయనతార పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే నయనతార పెళ్లికి హాజరై నందుకు నెటిజన్లు పెద్దఎత్తున షారుక్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా షారుక్ ఖాన్ పై నెటిజన్స్ మండిపడడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..గత నెల 25వ తేదీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసింది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే ఈ పార్టీ జరిగిన అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు.ఈ క్రమంలోనే నటుడు షారుక్ ఖాన్ సైతం కరోనా బారిన పడిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈయన కరోనా బారిన పడిన 15 రోజులు కూడా పూర్తికాకుండానే ఇలా పెళ్లికి హాజరు కావడంతో నెటిజన్లు ఇతని పై మండిపడుతున్నారు. పెద్ద స్టార్ట్ అయ్యిండి కూడా షారుక్ ఖాన్ ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించలేదని ఈ సందర్భంగా అతనిని ట్రోల్ చేస్తున్నారు.అయితే షారుక్ ఫ్యాన్స్ మాత్రం అతను పూర్తిగా కోలుకున్న తరువాత, డాక్టర్ల సలహా మేరకే ఈ వివాహానికి హాజరు అయ్యారని కామెంట్లు చేస్తున్నారు.