తండ్రి కర్కశానికి బలైన మూడేళ్ల చిన్నారి.. కేవలం కూతురు పుట్టిందన్న కోపంతోనే?

రోజురోజుకు ప్రపంచం ఉరుకులు పరుగులు పెడుతున్నప్పటికీ ఇప్పటికీ లింగ వివక్షత అనేది చాలామందిలో ఉంది.ప్రస్తుత కాలంలో అన్ని రంగాలలో అమ్మాయిలు దీటుగా నిలబడగా తమకు కూతురు పుడితే భారమవుతుందనీ భావించే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. ఈ క్రమంలోనే మగసంతానం కోసం ఎదురుచూస్తూ కూతురు పుట్టడంతో జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి ఆ కూతురి పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించారు.ఈ క్రమంలోనే తండ్రి చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ చిన్నారి రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడి మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ సైఫాబాద్‌లో నివాసముంటున్న బాసిత్ ఆలీఖాన్‌ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు ఈయన 8 సంవత్సరాల క్రితం సనా అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే ఈ దంపతులకు ఇప్పటికే నలుగురు కుమార్తెలు ఉన్నారు. మగసంతానం కావాలన్న ఉద్దేశంతో బాసిత్ అలీ ఖాన్ తన భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేదు.అయితే ఈ దంపతులకు ఐదవ సంతానం కూడా కూతురు పుట్టడంతో ఎంతో కోపం తెచ్చుకున్న భాసిత్ తాజాగా తన మూడు సంవత్సరాల కూతురు పట్ల ఎంతో కర్కషంగా ప్రవర్తించారు.

ఈ క్రమంలోనే మూడు సంవత్సరాల కుమార్తె ఫాతిమా బాత్రూంలో ఆడుకుంటూ ఉంది. అయితే ఎంత పిలిచిన తను బయటికి రాకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న భాసిత్ ఒక్కసారిగా తన కుమార్తెను నేలకేసి విసిరి కొట్టారు.ఆగ్రహంతో తన కూతురు పట్ల ఇలా కిరాతకంగా ప్రవర్తించడంతో చిన్నారి రెండు రోజులపాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడింది. ఇలా రెండు రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి చివరికి మృతి ఒడిలోకి చేరిన ఘటన చోటుచేసుకుంది. ఇలా అభం శుభం తెలియని చిన్నారి పట్ల ఇంత కిరాతకంగా ప్రవర్తించిన అతనిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.