కాళ్లపై పడి క్షమాబిక్ష కోరుకో… కొడాలి నానికి ఘోర అవమానం…ఇక రక్త కన్నీరే

kodali nani

 రాష్ట్రంలో అధికార పక్షము, ప్రతిపక్షము మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబును గత మూడు రోజుల నుండి వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో టీడీపీ నేతలు కూడా తమ నోటికి పనిచెప్పారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు.

kodali nani

 తాజాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడి వెంట్రుకకు ఉండే విలువ,శక్తి కూడా నానీకి లేవు, ప్రభుత్వ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కొడాలినానీ అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేశాడు. జగన్ మెప్పుకోసం, మంత్రిపదవి కాపాడుకోవడం కోసమే నానీ ఏకపాత్రాభినయాలు చేస్తున్నాడు. చంద్రబాబునాయుడే తనకురాజకీయ భిక్ష పెట్టాడనే నిజాన్ని నానీ గ్రహించి, చేసినతప్పు ఒప్పకొని ఆయనకాళ్లపై పడి క్షమాభిక్ష కోరితే మంచిదని మాణిక్యరావు అన్నారు.

 తండ్రి శవాన్ని పక్కనే పెట్టుకొని, ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినవ్యక్తి పంచన నానీ చేరాడంటే, అదికేవలం డబ్బు, పదవికోసమే. జగన్ తనకున్న కమ్మద్వేషాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానీని వాడుకుంటుంటే, కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకొని జగన్ దగ్గర మంత్రి పదవిని కాపాడుకోవడానికి నానీ ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబునాయుడి నెరిసిన వెంట్రుకసమానం కూడా నానీ చేయడు. అంటూ పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు.

pilli manikya rao

తా అంటే తూ…తూ అంటే తా అనడం తెలియని కొడాలినానీ లాంటివ్యక్తిని గెలిపించినందుకు గుడివాడ ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారన్నారు. అసెంబ్లీలో డైవర్ట్ పాలిటిక్స్ చేసే మంత్రులందరూ భవిష్యత్ లో తగినమూల్యం చెల్లించుకుంటారని, నానీ రౌడీఅయితే, ఆయన రౌడీయిజం గుడివాడలో చూపిస్తే బాగుంటుందని మాణిక్యరావు సూచించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిలా ప్రవర్తించడం చేతగాని కొడాలినానీకి వేళ్లు, కాళ్లు చూపించడానికి రాష్ట్రంలోని వందలమంది సిద్ధంగానే ఉన్నారన్నారు. నానీ వళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే అతనికే మంచిదని మాణిక్యరావు తీవ్రస్వరంతో హెచ్చరించారు. 

 టీడీపీని శిఖండి బారి నుంచి కాపాడి, నానీలాంటి ఎందరికో రాజకీయ భిక్షను అందించిన కర్ణుడనే పచ్చినిజాన్ని కొడాలి తెలుసుకుంటే మంచిదన్నారు. నానీకి రాజకీయాన్ని దానంచేసిన చంద్రబాబునాయుడు గురించి, ఆయన వ్యవహారశైలి గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం కొడాలికి లేవని, ఒకవేళ అవే ఉంటే, ఆయన తనతో బహిరంగ చర్చకు రావాలని మాణిక్యరావు సవాల్ చేశారు