Prabhas : క్రేజీ అప్డేట్ : ప్రభాస్ “సలార్” రెండు పార్ట్స్ పై అదిరే క్లారిటీ బయటకి వచ్చింది.!

Prabhas

Prabhas : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ కం మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా అనంతరం మరిన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా చేస్తున్నాడు.

మరి వీటిలో తన సాలీడ్ కటౌట్ కి తగ్గట్టుగా ప్లాన్ చేసిన సిసలైన మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రమే “సలార్”. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ప్లాన్ చేసిన ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ ని అందుకొని సంచలనం రేపింది. మరి అలా అక్కడ నుంచి మొదలైన ఈ భారీ సినిమా పరంపర పై మరిన్ని క్రేజీ అప్డేట్స్ మేకర్స్ అందించారు.

అలా మధ్యలో వచ్చి మరింత ఆసక్తి రేపిన అప్డేట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమాని ఏకంగా రెండు భాగాలుగా చేస్తున్నట్టు టాక్ బయటకి రావడంతో ఓ రేంజ్ లో రచ్చ లేచింది. అయితే అప్పుడు సరైన సోర్సెస్ చిత్ర యూనిట్ నుంచి లేవు కానీ ఇప్పుడు అయితే దీనిపై అదిరే క్లారిటీ బయటకి వచ్చింది. సలార్ రెండు భాగాలపై లేటెస్ట్ గా ప్రభాస్ (Prabhas ) ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురు కాగా ప్రభాస్ దీనిపై ఒక సరైన ముగింపు ఇవ్వకపోవడం ఆసక్తిగా మారింది.

సలార్ కి సీక్వెల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ.. దాన్ని ఆ సినిమా మేకర్స్ పైకి నెట్టేసాడు. దీనితో ఈ భారీ సినిమా సీక్వెల్ కి మరింత ఆశలు అభిమానుల్లో చిగురించాయి. దీనితో మళ్లీ సినీ వర్గాల్లో సలార్ పేరు వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు మరియు బృందమే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు.