చంద్రబాబుపై దారుణమైన ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసిన సీనియర్ నేత… వందల కోట్లు ఇచ్చాము

chandrababu naidu

 తెలుగుదేశం పేరుకు జాతీయ పార్టీ తప్పితే కనీసం ఆంధ్రాలో కూడా ఉనికిని నిలబెట్టుకోలేని స్థితికి చేరింది. ప్రతి రోజు ఎవరో ఒక నేత పార్టీపై తిరుగుబాటు చేయటంతో, పార్టీ జెండా మార్చటంతో చేస్తున్న ఉన్నారు, తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యనారాయణ సీతారామస్వామి (సోంబాబు ) పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపారు.

sombabu

 2014లో అధికారంలోకి వచ్చినా, పార్టీ తనను ఏమాత్రం పట్టించుకోలేదని.. ఐదేళ్లలో ఏనాడూ కనీస గౌరవం ఇవ్వలేదని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. వెలమ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారని సోంబాబు ఆరోపించారు. ఉంగుటూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని.. సభ్యత్వాల పేరుతో ఒక్కో జిల్లా నుంచి రూ.వంద కోట్లు వసూలు చేశారన్నారు. ఒక్క గోపాలపురం నియోజకవర్గం నుంచే తాము రూ.60 లక్షలు ముట్టజెప్పామని.. ఆ డబ్బంతా ఏమైందో కూడా తెలియడం లేదన్నారు.

 సభ్యత్వం కలిగిన కార్యకర్త చనిపోతే వారికి ఇన్సూరెన్స్‌ కింద కొంత నగదు ఇస్తామని చెప్పారని.. అయితే ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం పార్టీని పతనం చేస్తున్నాయని, త్వరలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. 2002 లో పోటీలో చేరిన సోంబాబు 18 ఏళ్ల నుండి టీడీపీ తరుపున పనిచేస్తున్నాడు, 11 ఏళ్ల నుంచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డారు.

 తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తాను ఇకపై తన కుటుంబ సభ్యులు స్థాపించిన చారిటబుల్‌ ట్రస్టుల వ్యవహారాలను చూసుకుంటానని చెబుతున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ బిక్కుబిక్కుమంటుంది, గత ఎన్నికల్లో 15 స్థానాలకు గాను కేవలం రెండు స్థానాలు మాత్రమే సాధించిన టీడీపీ, తిరిగి పుంజుకోవాలని చూస్తున్న సమయంలో సోంబాబు పార్టీకి రాజీనామా చేయటమే కాకుండా చంద్రబాబు మీద దారుణమైన విమర్శలు చేసి వెళ్లి పోవటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.