Accident: జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..! అదుపుతప్పి బీభత్సం సృష్టించిన భారీ ట్రక్..!

Accident: ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామ్గఢ్లోనిని పటేల్ చౌక్​లో జాతీయ రహదారి-33పై ఓ భారీ ట‍్రక్కు అతి వేగం వల్ల అదుపుతప్పి బీభత్సం సృష్టించింది.

వివరాలలోకి వెళితే..రామ్​గఢ్​లోని పటేల్ చౌక్​లో జాతీయ రహదారి-33పై అతివేగంగా వస్తున్న ఒక భారీ ట్రక్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఎన్నో వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ట్రక్కు అతి వేగంగా రావడం వల్ల కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టి బోర్లా పడింది.

ట్రక్కు బోర్లా పడడంతో వాహనాలు ఈ మధ్య ఇరుక్కున్న వారిని జెసిబి సహాయంతో బయటకి తీశారు. ట్రక్కు అతి వేగంగా ఉండటం వల్ల డ్రైవర్ ట్రక్కు ని అదుపు చేయలేక పోవటంతో ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అవటంవల్ల పోలీసులు సంఘటనని మొత్తం పరిశీలించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా కూడా వాటిని అధిగమించి ప్రమాదాలకు కారణమవుతున్నారు.