Crime News: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన వలస కూలీలు..!

Crime News: ఇటీవల ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెళ్లి రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.వాహనాన్ని నడిపే వారు అజాగ్రత్త నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో రెండు ప్రమాదాలు జరగగా, అనంతపురం జిల్లాలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి కర్ణాటక నుండి అనంతపురం జిల్లాలో బోరంపల్లి ప్రాంతానికి బయలుదేరిన వలస కూలీలు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి అందులో వెళ్తున్న కూలీలు తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలోఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కర్ణాటక రాష్ట్రంలోని మొలకలుమూరు నుండి రెండు ట్రాక్టర్ లలో 20 మంది కూలీలు కళ్యాణదుర్గం మండలం బొల్లంపల్లి కి నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి స్లాబ్ నిర్మాణం నిమిత్తం బయలుదేరారు. మార్గమధ్యంలోనే బ్రాహ్మణపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా 8 మంది గాయాల పాలయ్యారు. వీరందరిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.