సహజీవనం వద్దు అన్నందుకు ఏకంగా అంతటి దారుణానికి తెగించిన వ్యక్తి?

హైదరాబాదులో కూకట్ పల్లికి చెందిన వెంకట్ లక్ష్మి అనే 50 ఏళ్ల వివాహిత నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో కాంటాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది. ఆమెకు వికలాంగుల పింఛనుదారు కూడా వస్తుంది. పదేళ్ల క్రితమే ఆమె భర్త చనిపోవడంతో కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తుంది. ఇటీవలే తన కుమార్తె వివాహం కూడా చేసింది. అయితే వెంకట్ లక్ష్మికి కొన్ని సంవత్సరాల క్రితం నగరంలోని జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప లో వెంకటేష్ అనే 55 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వెంకటేష్ కూడా భార్య చనిపోవడంతో అతడు తన కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. వెంకటేష్ స్థానికంగా ఉండే ఒక వెల్డింగ్ దుకాణంలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

వీరిద్దరికీ పరిచయం ఏర్పడిన ఎంతో ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇద్దరూ సహజీవనం చేశారు. అయితే ఇటీవల ఈ సహజీవనం విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వెంకట్ లక్ష్మి తన కుమారుడితో కలిసి కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ కు మారింది. ఈ క్రమంలోనే వెంకటేష్ తనతో ఉండాలి అంటూ వెంకటలక్ష్మి పై పలుసార్లు ఒత్తిడి తెచ్చాడు.. తనతో ఉండాలి అంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.. అందుకు ఆమె నిరాకరించడంతో సహజీవనం చేసిన ఆమె పైన ఏకంగా పగ పెంచుకున్నాడు. తాజాగా బుధవారం రోజు సాయంత్రం వెంకటలక్ష్మి కుమారుడు వెళ్లగా అదే అదనుగా భావించిన వెంకటేష్ రాత్రి 8 గంటల సమయంలో ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమె వద్దన్న అతను ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే వెంకటేష్, వెంకటలక్ష్మి పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంకటలక్ష్మి ఇంట్లో నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో అది గమనించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూశారు. అయితే అప్పటికే సగం కాలిన గాయాలతో వెంకటలక్ష్మి మృతి చెందింది.. వెంకటేష్ సైతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. స్థానికులు వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అతను ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.