Katha kanchiki manam intiki : ఏప్రిల్ 8న కథ కంచికి మనం ఇంటికి… నవ్వించి పంపుతామని హామీ ఇస్తున్న టీం…!

Katha kanchiki manam intiki : చాణక్య చిన్న దర్శకత్వం వహించిన సినిమా కథ కంచికి మనం ఇంటికి హారర్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ సినిమా మూస చిత్రాల్లా కాకుండా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా తెరకెక్కించారు.కథ కంచికి మనం ఇంటికి చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్యలు పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పబ్లిసిటీ కంటెంట్ కు అనూహ్యమైన స్పందన లభించింది.
కథ కంచికి మనం ఇంటికి సినిమా చాలా భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుందనే నమ్మకంతో మా చిత్ర బృందం భావిస్తున్నాము. ఈ సినిమాలో హీరో అదిత్ అరుణ్, పూజీత పొన్నాడ ఫెయిర్ అండ్ లవ్లీగా ఉండనుంది. అలానే ఆర్ జే హేమంత్, గెటెప్ శ్రీను మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకే మెయిన్ హైలెట్. భారీ రేంజ్ లో ఈ సినిమాను ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని నిర్మాత మోనిష్ పత్తిపాటి తెలిపారు.

దర్శకుడు చాణక్య చిన్న మట్లాడుతూ కథ కంచికి మనం ఇంటికి స్టోరీ ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. అదిత్ అరుణ్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ కథ హార్రర్ జోనర్‌లోకి మలుపు తీసుకుంటుంది. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మొత్తం సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు దర్శకుడు చాణక్య. ఈ కథను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత మోనిష్ పత్తిపాటి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ దత్తి సురేశ్ బాబు నిర్మించారు. కరోనా కష్ట కాలంలో యూనిట్ లో ఎవరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. భీమ్స్ సంగీతం, వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫి ఈ సినిమాను ప్రధాన ఆకర్షణ అవ్వబోతున్నాయి. ఏప్రిల్ 8న ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుందని నమ్ముతున్నాను. నటీనటులు: అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను నటించారు.