రష్మిక కోసం గట్టిగానే ఖర్చు చేశారా.?

ఈ మధ్య ఓ చిన్న సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఏకంగా నేషనల్ క్రష్ రష్మిక మండన్నా దిగొచ్చింది. ఆమె చేతుల మీదుగా ఆ చిన్న సినిమాకి సంబంధించి ఓ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

అయితే, ఈ విషయం చాలా మందికి షాక్ ఇచ్చింది. సర్ సర్లే రష్మికతో ఆ నిర్మాతలకున్న పరిచయం అలాంటిది. ఆ కారణంగానే వారి సినిమాని ప్రమోట్ చేయడానికి రష్మిక తేలిగ్గానే ఒప్పుకుందనే ప్రచారం జరిగింది.

కానీ, తెరవెనుక కథ వేరేలా వుంది. అలా ప్రమోట్ చేసినందుకు ఆమెకు పెద్దమొత్తంలో చెల్లించుకున్నారట. ప్రత్యేకంగా బస ఏర్పాట్లు కూడా జరిగాయట. అంతేకాదు, ప్రయాణ ఖర్చులతో సహా సదరు నిర్మాతలు భరించారట. మరి ఏమనుకున్నారు రష్మిక అంటే మామూలు విషయమా.? అని సినీ జనం చర్చించుకుంటున్నారు.

మరోపక్క టాక్ ఇంకోలా వినిపిస్తోంది. రష్మిక స్టార్‌డమ్ సంపాదించుకున్నా డౌన్ టు ఎర్త్.. అనే వాదన కూడా వుంది. ఏమోలెండి.! నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా.! తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ, ఏది ఏమైనా రష్మికకు భారీ మొత్తంలో ముడుపులు అయితే అందినట్లే కనిపిస్తోంది.