‎Nagarjuna: దసరాకి గ్రాండ్ గా లాంచ్ కాబోతున్న నాగార్జున 100వ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

‎Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో 100 సినిమాలు చేసిన హీరోయిన్ లు, హీరోలు చాలామందే ఉన్నారు. ‎అలా సినీ ఇండస్ట్రీలో 100 సినిమాలు చేయడం అనేది మాములు విషయం కాదు. చాలా మందికి ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. తక్కువ ముందికి ఈ అవకాశం దక్కుతుందని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మరో స్టార్ హీరో ఈ మార్క్ ను టచ్ చేయబోతున్నాడు. ఆ స్టార్ మరోవరో కాదు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.

‎ఇప్పటివరకు 99 సినిమాల్లో నటించి తన ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ను మెప్పించిన నాగార్జున 100వ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. కాగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సినిమాను డైరెక్ట్ చేసే భాద్యతను తమిళ దర్శకుడు రా.కార్తీక్ చేతిలో పెట్టాడట కింగ్ నాగార్జున. ఇక్కడ విశేషం ఏంటంటే, రా. కార్తీక్ కి ఇదే మొదటి సినిమా.

‎ఒక కొత్త దర్శకుడికి తన 100 వ సినిమా బాద్యతను అప్పగించడం అంటే మాములు విషయం కాదని చెప్పాలి. డైరెక్టర్ కార్తీక్ కూడా ఈ సినిమా పట్ల చాలా జాగ్రత్తలు వహిస్తున్నారట. మరి నాగార్జున తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని రా. కార్తీక్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడా అనేది చూడాలి మరి. ఇక ఈ స్పెషల్ ప్రాజెక్టు కోసం రా. కార్తీక్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి పక్కా కమర్షియల్ సబ్జెక్టును ప్రిపేర్ చేశాడట. రా. కార్తీక్ తో నాగార్జున సినిమా చాలా కాలం క్రితమే ఒకే అయ్యిందట. కానీ కథను పెర్ఫక్ట్ గా సెట్ చేయడం కోసమే ఇంతకాలం పట్టిందట. కథ కథనం పక్కాగా కుదిరాయి అని డెసిషన్ కి వచ్చాకే అధికారిక ప్రకటన చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక కార్తీక్ చెప్పిన ఫైనల్ న్యారేషన్ తో కన్విన్స్ అయిన నాగార్జున షూట్ కి ఒకే చెప్పేశాడట.