సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో రూ.68 వేలు టోకరా వేసిన మోసగాడు..

కోవిడ్ సమయంలో సిని నటుడు సోనూసూద్ ఎంత సహాయం చేసాడో అందరికి తెలిసిందే. ఇక ఇప్పటికి ఈయన సహాయం చేస్తూనే ఉన్నాడు. పైగా సోషల్ మీడియా ద్వారా కూడా ఈయన తన వంతు సహాయం చేస్తున్నాడు. కానీ తాజాగా సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ వ్యక్తి పెద్ద టోకరా వేసాడు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే..

హైదరాబాద్ కు చెందిన పి. సంధ్య అనే 36 ఏళ్ల మహిళ తమ బంధువులో ఒకరికి క్యాన్సర్ చికిత్స కోసం డబ్బు అవసరమైందని ట్విట్టర్లో సోనూసూద్ ఫౌండేషన్ ను ఆశ్రయించగా అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫౌండేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి.. ఆమెకు ఒక యాప్ గురించి వివరించి ఓటీపీ తెలుసుకున్నాడు. దీంతో ఆమె అకౌంట్లో ఉన్న రూ.68 వేలు కాజేయగా.. దీంతో తాను మోసపోయిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.