హత్రాస్ కేసులో కీలక మలుపు..యోగిపై నమ్మకం లేదేమో..?

priyanka gandhi telugu rajyam

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హత్రాస్ కేసు నిన్న శనివారం కొన్ని అనూహ్య మలుపులు తిరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించటానికి రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ పరామర్శించటానికి వెళ్లటంతో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి, ఢిల్లీ నుండి వచ్చిన కాంగ్రెస్ నేతలను గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకున్నారు, ప్రియాంక గాంధీ కారు డ్రైవ్ చేస్తుంటే రాహుల్ గాంధీ పక్కన కూర్చుకున్నాడు, కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని పోలీస్ లు చెప్పటంతో కొద్దిసేపు కాంగ్రెస్ నేతలకు పోలీసులకు తోపులాట జరిగింది.

yogi adhtyanad telugu rajyam

 

 ఈ దశలో ప్రియాంక గాంధీని మగ పోలీస్ రెక్క పట్టుకొని పక్కకు లాగటం జరిగింది. కనీసం మహిళా పోలీసులను కూడా ఉపయోగించకపోవటం విమర్శలకు తావిస్తుంది. తర్వాత రాహుల్ గాంధీ బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించి దాదాపు 45 నిముషాలు వాళ్లతో మాట్లాడారు. ఆ తర్వాత దీనిపై సీఎం యోగి ఆదిత్యనాధ్ మాట్లాడుతూ హత్రాస్ కేసును సీబీఐకి ఇస్తున్నట్లు ట్విటర్ లో ప్రకటించాడు. అయితే దీనిపై బాధిత కుటుంబం సానుకూలంగా కనిపించలేదు. ఈ కేసును వాళ్ళను సుప్రీంకోర్టు పరివేక్షణలో మాత్రమే విచారణ జరగాలని కోరుకుంటున్నారు, అదే సమయంలో బాధిత కుటుంబ సభ్యులు కొన్ని డిమాండ్ చేస్తున్నారు.

 ఆ జిల్లా కలెక్టర్ ను పదవి నుండి దించేయాలని, ఇక ముందు ఉన్నత పదవులు చేపట్టకుండా చూడాలి. తమ కుమార్తె మృతదేహాన్ని కుటుంబసభ్యుల అనుమతి లేకుండా అర్ధరాత్రి పెట్రోల్ తో ఎందుకు దహనం చేసారు.మమల్ని పదే పదే ఎందుకు బెదిరించారు. శ్మశానవాటికలో పూలు లభించాయి, ఆ మృతదేహం మా కూతురిదే అని నమ్మేదెలా..? పైన అడిగిన వాటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. ఇక యూపీ ప్రభుత్వం కూడా తమ మీద వస్తున్నా ఆరోపణల నేపథ్యంలో వాటిని చెరిపేచుకోవటానికి ట్రై చేస్తుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు బాధిత కుటుంబ ఇంటికి వెళ్లి మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పటంతో పాటుగా ఆ వూరు చుట్టూ ఉన్న భారిగేట్లు తొలిగించి, రాజకీయ నేతలకు మీడియాకు అనుమతి ఇస్తున్నారు