కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఓ పక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చిరిస్తుంది. విధిగా ప్రజలకు ప్రభుత్వం సూచనలు పాటిస్తూ ఎవరి ఆరోగ్యం పై వారు శ్రద్ధ తీసుకుంటున్నారు. ముక్కుకి మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం ఇలా అవకాశం ఉన్నంత వరకూ ఎవరు జాగ్రత్తులు వారు తీసుకుంటున్నారు. సాధారణ పౌరుడి కంటే విధిగా వ్యవరించాల్సిన ఓ ప్రభుత్వ అధికారిని మాస్క్ పెట్టుకోమనడమే తప్పైంది. ఆ మాట అన్నందకు ఓ మహిళా ఉద్యోగిని ఇనుపరాడ్డుతో బాది..అంతకీ కోపం చల్లారకపోవడంతో జుట్టు పట్టుకుని మరీ కుర్చీ మీద నుంచి కింద పడేసి ఈడ్చి ఈడ్చి మరీ కొట్టి దాష్టికానికి తెగబడ్డాడు ఓ అధికారి.
అడ్డుకున్న సహాద్యోగుల్ని పక్కకు నెట్టాడు. ఇద్దరు అడ్డుకునే ప్రయత్నం చేయగా, అందులో ఒక ఉద్యోగైతే ఏకంగా భయపడిపోయాడు. మరొకరు ధైర్యంగా సాహసించి అతన్ని బయటకు లాగుకుని వచ్చాడు. ఆ సమయంలో మిగతా ఉద్యోగులంతా గందరోగాళానికి గురయ్యారు. మహిళా ఉద్యోగులైతే చెవులు మూసుకుని బయటకు పరుగులు తీసే ప్రయత్నం చేసారు. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే నెల్లురు జిల్లాలో. ఆ జిల్లాలోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ విషయం వీడియో రూపంలో బయటకు రావడంతో భాస్కరావుపై మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగినితో పోలీసులు ఫిర్యాదు తీసుకుని…అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ దాష్టికానికి పాల్పడింది డిప్యూటీ మేనేజర్ భాస్కరరావు. బాధిత మహిళా ఉద్యోగి పేరు ఉషారాణి. ఈనెల 27న ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భాస్కరరావు ని సస్పెండ్ చేసారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదేశాల మరకు భాస్కరరావుని సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీడీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. భాస్కరరావు క్వార్టర్స్ దాటి బయటకు వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు.
దాడికి పాల్పడిన వీడియో క్రింద ఇవ్వబడింది