గతంలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా కూడా దేశంలో ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గలేదు. కొన్ని చోట్ల ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించగా మరికొన్ని చోట్ల మాత్రం వాడుకలోనే ఉంది. దీంతో కేంద్రం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కొన్ని రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి 16 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది కేంద్రం. అందులో ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్ క్రీమ్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, స్వీట్ బాక్స్ లు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, పివిసి బ్యానర్లు, థర్మకోల్ వంటి వస్తువులను కేంద్రం నిషేధించింది. ఇక ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించాలి అని కేంద్రం స్పష్టం చేసింది.