Rajamouli And Megastar : రాజమౌళితో సెన్సేషనల్ సినిమాపై ఓపెన్ అయ్యిన మెగాస్టార్ చిరంజీవి.!

Rajamouli And Megastar : ఇప్పుడు భారతీయ సినిమా దగ్గర టాప్ దర్శకుల పేర్లు తీస్తే అందులో మన తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు టాప్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. తాను లేటెస్ట్ గా తీసిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో రికార్డు వసూళ్లు కొల్లగొట్టి సినిమా అదరగొట్టింది.
అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించిన ఇంకో మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య” ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల కాంబోలో ఫస్ట్ టైం తీసిన ఈ సినిమా భారీ అంచనాలు నడుమ విడుదలకి సిద్ధంగా ఉండగా ఈ సినిమా ఫంక్షన్ కి కూడా రాజమౌళి వెళ్లడం జరిగింది.
అయితే ఇక్కడ నుంచి మెగాస్టార్ మరియు రాజమౌళి కాంబో నుంచి ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది అని ఒక టాక్ పెద్ద ఎత్తున వినిపించింది. ఇక ఈ అంశం పై మెగాస్టార్ చిరు లేటెస్ట్ గా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అసలు మాటలో ఎలాంటి వాస్తవం లేదని..
నిజంగా రాజమౌళితో అవకాశం వస్తే చెయ్యడానికి సిద్ధమే కానీ అది జరిగే పని కాదని క్లారిటీ ఇచ్చారు. అలాగే తమ ఇద్దరికీ కూడా మ్యాచ్ అవుతుందో లేదో నేను రాజమౌళి డైరెక్షన్ ని మ్యాచ్ చేయగలనా అనేది కూడా అనుమానమే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి తమ కాంబోలో సినిమాపై ఒక ఫైనల్ క్లారిటీ ఇచ్చేసారు.