Hyderabad: కాలం మారుతున్న, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ఇలా రోజుకు ఎంతోమంది మహిళలు చిన్న పిల్లలు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.ఇలాంటి ఘటనలను ఆపడం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకు వచ్చినప్పటికీ ఈ దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
సుజాత లా పబ్లిషింగ్ హౌస్ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని గోకుల్‌ధామ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన ఇంట్లో పని మనిషిగా చేసే ఓ మహిళలు 2017లో బడంగ్ పేటలోని తన ఓపెన్ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఇలా వాచ్ మెన్ గా పనిచేస్తూ రూపాయి రూపాయి కూడా పెట్టి తన మేనమామతో కలిసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో బాధితురాలి తల్లి పక్క ఊరికి వెళ్ళింది అనే విషయం తెలుసుకున్న వీరారెడ్డి తన పుస్తకాలు సర్దడం కోసం సంచులు కావాలనే నెపంతో ఆ ఇంటికి వెళ్ళాడు.
ఇలా ఇంట్లో తన తల్లి లేకపోవడంతో 13 సంవత్సరాల తన కూతురుతో ఎంతో ఆప్యాయంగా ప్రవర్తించి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ని ఇంటి నుంచి తన తల్లి రాగానే తన తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పి కూతురు కన్నీరుమున్నీరైంది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వీరా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.