కరోనా మమ్మారి వృద్ధులు చిన్నారులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఈ వైరస్ సోకితే మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో డెత్ రేటు లో ఎక్కువగా ఉండేది వృద్దులు..చిన్నారులే. భారత్ లోనూ మహమ్మారి చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసులు 70 వేలు దాటిపోయి…లక్షకు చేరువలో ఉన్నాం. మరణాలు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే భారత్ లో మరణాలు ఏ వయసు వారికి సంభవిస్తున్నాయి అన్నది సరైన క్లారిటీ లేదు. ప్రభుత్వం డెత్ రేట్ ను దాచి పెడుతుంది అన్న వార్త ఇప్పటికే దుమారం రేపుతోంది.
వైరస్ తో చనిపోయిన వారి అంత్య క్రియలు ఎలా జరుపుతున్నారు వంటి విషయాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు. రోజువారి కేసులు..మరణాలు ఇంతా అని చెబుతున్నా…వాస్తవాలు దాచి పెడుతున్నారు అన్న మాట మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. ఏ రాష్ర్టానికి ఆ రాష్ర్టమే కేసుల సంఖ్య స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో కేంద్రం విమర్శలు ఎదుర్కోంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన 35 ఏళ్ల బీజేవైఎం కు చెందిన నాయకుడు కరోనా వైరస్ తో మృతి చెందడం అంతటా కలకలం రేపుతోంది.
ఆగ్రాకి చెందిన ఇతను ఎస్ ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రాలో కొవిడ్ -19 మృతి చెందిన వారి సంఖ్య 27కి చేరుకుంది. వయసులో ఉన్న 35 ఏళ్ల నాయకుడు చనిపోవడంతో యూపీలో కలకలం రేగుతోంది. ఆరోగ్యంగా ఉండే 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందడం అక్కడి వాసుల్ని కలవర పెడుతోంది. అతనికి ఇంతకుముందే ఏవైనా రోగాలు ఉన్నాయా? వాటి ప్రభావం..వైరస్ ప్రభావం ఏకమవ్వడంతో మృతి చెందాడా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్లు దీనిపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.