విక్టరీ వెంకటేష్ త్వరలో పొలిటీషియన్‌గా దర్శనమివ్వబోతున్నారట. రియల్ లైఫ్‌లో కాదండోయ్. రీల్ లైఫ్‌లోనే. ఓ సినిమా కోసం పొలిటీషియన్ పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారట.
ఓ కొత్త డైరెక్టర్ వెంకటేష్ కోసం ఓ స్టోరీ నెరేట్ చేశాడట. స్టోరీ లైన్ వెంకీకి బాగా నచ్చిందట. అయితే, అక్కడక్కడా కొన్ని మార్పులు సూచించాడట వెంకటేష్.
అంతా సెట్ అయితే, వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లనుందట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా రూపొందబోతోందట. తన ఏజ్‌కి తగ్గ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడట ఈ సినిమాలో.
ప్రస్తుతం, వెంకటేష్ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో పాటూ, ‘సైంధవ్’ అనే యాక్షన్ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘సైంధవ్’ షూటింగ్ దశలో వుండగా, త్వరలోనే ‘రానా నాయుడు’ ద్వారా ఓటీటీలో సందడి చేయబోతున్నారు వెంకటేష్.