Gallery

Home News ఎట్ట‌కేల‌కు యాంక‌ర్ ప్ర‌దీప్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు.. ఇక 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలానో తెలిసిపోతుంది!

ఎట్ట‌కేల‌కు యాంక‌ర్ ప్ర‌దీప్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు.. ఇక 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలానో తెలిసిపోతుంది!

బుల్లితెర రారాజుగా కీర్తించ‌బడుతున్న ప్ర‌దీప్ మాచిరాజు ప‌లు షోస్‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌దీప్ షోని హోస్ట్ చేస్తున్నాడంటే ఆ సంద‌డి వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. చ‌లాకీ మాట‌ల‌తో వెరైటీ పంచ్‌ల‌తో ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంటారు. అయితే ఇన్నాళ్లు బుల్లితెర‌పై సంద‌డి చేసిప ప్ర‌దీప్ వెండితెర‌పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని అనుకున్నాడు. ఇందుకోసం 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం గ‌త ఏడాది మార్చిలో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు.

Pra | Telugu Rajyam

సుకుమార్ ద‌గ్గ‌ర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్క‌డినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంతో మున్నా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో అమృత‌రావు క‌థానాయిక‌గా న‌టించింది. అనూప్ రూబెన్స్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన‌ మూడు పాట‌ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. మూడింటికీ మంచి రెస్పాన్స్ ల‌భించింది. ప్ర‌త్యేకించి ‘నీలి నీలి ఆకాశం’ పాట సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించి, ఇప్ప‌టివ‌ర‌కూ 218 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం పెద్ద విశేషం. ఈ పాట‌ల‌న్నింటినీ చంద్ర‌బోస్ రాశారు.

క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా అనే సినిమా కోసం ప్ర‌దీప్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం జ‌న‌వ‌రి 29న చిత్రాన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎలాగైతే ఆక‌ట్టుకుందో, సినిమా కూడా ప్రేక్ష‌కుల్ని అలాగే అల‌రిస్తుంద‌ని నిర్మాత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.శివ‌న్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వైవా హ‌ర్ష‌, హైప‌ర్ ఆది, ఆటో రామ్‌ప్ర‌సాద్‌, భ‌ద్రం, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. 

- Advertisement -

Related Posts

పవన్ గురించి రానా ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ మీద భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ మూవీ రెండు పాత్రల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. మరి...

కరోనా మూడో వేవ్: కేరళకు ఏమయ్యింది.?

దేశంలోకి మొదట కరోనా వైరస్ ప్రవేశించిందే కేరళ రాష్ట్రం ద్వారానే. చైనా నుంచి వచ్చిన ఓ కేరళ వ్యక్తి కరోనా వైరస్‌ని దేశంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశంలో కరోనా వైరస్ విస్తరించడానికి...

కేంద్రం కాఠిన్యం: విశాఖ ఉక్కు పరిశ్రమపై వారికి హక్కు లేదా.?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్రం పేర్కొన్న అంశాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.....

Latest News