సోషల్ మీడియా లో కొన్ని యుట్యూబ్, వెబ్ సైట్ లలో తంబ్ నెల్స్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో అందరినీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం పై .తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పై స్పందించిన 24 క్రాఫ్ట్డ్ ప్రెసిడెంట్స్ & సెక్రెట్రీస్ .. తంబ్ నెల్స్ & పైరసీ పై లపై యాక్షన్ తీసుకోవాలని నిర్మాతల మండలి ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన సభ్యులు,సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మధుసూదన్, సెక్రటరీ, పలువురు పాల్గొన్నారు.
నటుడు మాదాల రవి గారూ మాట్లాడుతూ.. ప్రపంచ మొత్తం మిడియ పైనె నడుస్తూంది మంచి న్యూస్ ద్వారా ప్రజలు చైతన్య వంతులు అవుతారు.అలాంటిది ఈ వేళ కొన్ని వందల కంప్లైంట్ లు వచ్చినవి.ఈ ఇండస్ట్రీ లొ మహామహులు ఆర్టిస్ట్ లు ఎంతో కష్టపడి పేరు తేచ్చుకొని ఆర్టిస్ట్ లు అయ్యరు వారి గురించి రాంగ్ తంబ్ నేయిల్ పెట్టి వారి కుటుంబం గురించి, పర్సనల్ లైఫ్ గురించి చేడుగా రాయటం అలాగె కొందరు ఆర్టిస్ట్ లు ఉన్నప్పటికి వారు చనిపొయారంటూ వారి ఫొటోలకు దండ లు వెయటం లాంటివి చేయటం ద్వారా వారి కుటుంబాలు చాలా బాద పడుతున్నారు.మీకు లైక్ లు షేర్ ల కోసం రాంగ్ తంబ్ నేల్స్ పెట్టొద్దు. ఒక ఆరోగ్య కరమైన మిడియాని తయారు చేయండి.
కొన్ని కొన్ని దేశాల్లో యుట్యూబ్ ద్వారా విప్లవాలు తీసుకొచ్చారు. 24 క్రాఫ్ట్స్ మీ ముందుకు వచ్చి విజ్ఞప్తి చేస్తున్నాము.వారి ఆదర్శ జీవితాలను నాశనం చేయద్దని మనవి చేసుకుంటాము అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడుతూ.. గతంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటి ఫెసింగ్ జరిగింది.అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యాయి.ఇప్పుడు టెక్నోలజీ డిజిటల్ పెరగాడంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫెస్ చేస్తున్నాము. మీరు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు నిజా నిజాలు కనుకొని పెట్టండి అంతే కానీ మీ లైక్ ల కోసం నిర్మాతలను, నటులనుదర్శకులపై తంబ్ నెల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.దీనిపై మేము త్వరలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తూ..మా పైరసీ సెల్ ను యాక్టీవ్ చేస్తాము అన్నారు
వి.యన్ ఆదిత్య గారు మాట్లాడుతూ.. మిడియా అనేది పదునైన కత్తి లాంటిది దానికి రెండు సైడ్స్ వుంటాయి.నిజంగా పాజిటివ్ గా ఉపయెగిసై మిరు సమాజనికి ఎంతొ మేలు చేయగలుగుతారు. ప్రజలని చైతన్య వంతులు ని చేయగలరు అన్యాయాలపై నా పోరాటాలు చేయెచ్చు కానీ దాన్ని రాంగ్ గా ఉపయెగిస్తె మాత్రం చాలా జీవితాలు నాశనం అవుతాయి. ఆత్మహత్యలు చేసుకొవాల్సి వస్తుంది అందుకనె మా మూవీ ఆర్టిస్ట్ ల అసోసియేషన్ తరపు నుంచి మీకు విన్నపం చేస్తున్నాం దయచేసి ఫాల్స్ న్యూస్ లు రాంగ్ తంబ్ నేయిల్స్ యిచ్చి వారి జీవితాలను నాశనం చేయెద్దని తెలిపారు.
డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ గారు మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ లు ఎంతో పెట్టుబడి పెట్టి డైరెక్టర్లు, రైటర్స్,కథలు ఆలోచించి గొప్ప గొప్ప బడ్జెట్ సినిమా లు తీసి అవి ప్రజల ముందు పెట్టటానికి కూడా ఒక సెన్సార్ విదానం వుంటుంది కానీ సోషల్ మీడియా లో ప్రముఖులందరి గురించి వారి క్యారెక్టర్ ఎసాసినెషన్ చేస్తు రాంగ్ తంబ్ నేల్స్ పెట్టి వ్యుస్ కొసం ఎదొ చేప కి ఎర వెసినట్లు పైన హెడ్డింగ్ పెట్టడం లోపల కి వెళ్ళాక ఏమి లేకుండా పాజిటివ్ గా రాయటం యిది చిటింగ్ అని యుట్యూబ్ కు కూడా సెన్సార్ విధానం తీసుకరావాలి అని అన్నారు.
మోహన్ వడ్ల పట్ల మాట్లాడుతూ.. ట్రంప్ లాంటి వారు రూల్స్ పాటించలేదని తన ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేసింది.అలా ప్రతి దానికి లీగల్ గా లేకపోతే ఇబ్బందులు వస్తాయి.కాబట్టి అలాంటివన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలని కోరుకుంటాను. కాబట్టి మీ వల్ల ఎవరు ఇబ్బంది కలగకుండా ఉంటే మా వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు…
డైరెక్టర్ అసోసియేషన్ కార్యదర్శి గారు మాట్లాడుతూ మీడియా ద్వారా అడ్రస్ చేయటం మిమ్మల్ని అనటం కాదు మీ బాధ ని మీ ద్వారా ప్రపంచానికి తెలియ చేయాలి అని నిజంగా మిమ్మల్ని బధానం చేసె చానల్స్ కి చెప్పుకోవటమే నిజంగా మా సినిమా వాళ్ళకి తీరిక లేక కాని లీగల్ యాక్షన్ తీసుకుంటే చాలా చానల్స్ మూసివేయాల్సి వస్తాది. దానిమీద లీగల్ గా చాలా రైట్స్ ఉన్నాయి. యుట్యూబ్ వేశారు కంటెంట్ ను టార్గెట్ చేయకుండా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. దయచేసి ఒకరి వ్యక్తి గత జీవితానికి భంగం కలగకుండా చూడాలని కోరుతున్నాను. మీరంతా మంచిగా స్వతంత్ర్యంగా, స్వేచ్ఛగా రాజ్యాంగ బద్దంగా మంచి కంటెంట్ వేస్తే ఇండస్ట్రీ నుండి మేము సపోర్ట్ చేస్తాం. మీడియా అనేది శారద పాత్ర పోషించండి కాని నారద పాత్ర పోషించకండి అన్నారు
ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ లో చాలా సమస్యలు వున్నాయి నేగెటివ్ స్స్క్రొలింగ్ లో సినిమా రిలీజ్ కాకుండా నే రీవిల్ చేయడం. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు OTT అనే డీజిటల్ ఫ్లాట్ ఫాం వచ్చినప్పుడు వాటికి ఇండియా సెన్సార్ షిప్ యాక్ట్ గాని సినిమా ఆటొగ్రాఫి సెన్సార్ యాక్ట్ గాని ఎది వర్తించకుండా వాళ్ళ యిష్టం వచ్చినట్టు కంటెంట్ యిస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రం యుట్యూబ్ లో రావడం పైరసీ. ముఖ్యంగా ఫీల్మ్ ఛాంబర్ లో యాన్టి పైరసి అనే ఒక విభాగం వుండేది అది యిప్పుడు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది.దాంతో ఫిల్మ్ ఛాంబర్ పాత్ర సూన్యమైంది అన్నారు.
జీవిత గారు మాట్లాడుతూ.. నేను నా కుటుంబం మా షుటింగ్ లలో మా పనులు ఏవో మేము చూసుకుంటం. ఏదైన అన్యాయం వుంటె ప్రశ్నిస్తాం తప్ప కాని నా మిద వచ్చిన అన్ని న్యూస్ లు ఇంక ఎవరి మీద రాలేదు. మీడియా అంటే యిదే కాదు కొన్ని యుట్యూబ్ చానల్స్ మా కుతుర్లు మీద కూడా కొన్ని నెగెటివ్ ప్రచారాలు చెస్తున్నాయి. అది మా జివితాలనుఎంతొ ఎఫెక్ట్ చేస్తున్నాయినేను అన్ని మీడియా చానల్స్ ని అనటం లేదు అని తేలిపారు
యన్.శంకర్ మాట్లాడుతూ .. ఒకప్పుడు జర్నలిజం కి ఇప్పుడు జర్నలిజం కి చాలా తేడా వుంది.కాని ఈ మద్య చూస్తుంటే ఇండస్ట్రీ లొ వున్న వాళ్ళ పై లేని పోనివి రాస్తు వుంటె చాలా బాధ గా వుంటుంది.ప్రింటు మీడియా లో కాని ఎలక్ట్రానిక్ మీడియా లో కాని ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వుంటుంది తప్పు లను తీసిపాడెస్తారు కాని ఈ సోషల్ మీడియాలో అటువంటిది ఎమి లేదు వారికీ ఇష్టమైనది రాసుకుంటు వెళ్తున్నారు దీన్ని అరికట్టాలి అని తేలియచేశారు