2021 కేంద్ర ఆర్థిక బడ్జెట్: రూ 64,180 కోట్లతో హెల్త్‌ స్కీమ్‌ !

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈసారి బడ్జెట్ డిజిటల్ విధానంలో ప్రవేశ పెడుతున్నారు. భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించకపోయి ఉంటే కరోనా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లి ఉండేదని నిర్మలా సీతారామన్ అన్నారు. అత్యవసర రంగంలో పనిచేసేన వారంతా ప్రాణాలు ఒడ్డి సేవ చేశారని కొనియాడారు. విద్యుత్, వైద్య రంగం, బ్యాంకింగ్, అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలు ఒడ్డి పనిచేశారని వారిని అభినందించారు. అంతకు ముందు పార్లమెంట్‌లోనే జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆరోగ్య మౌలిక వసతులకు ఈ బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిపామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రానున్న ఆరేళ్లలో రూ 64,180 కోట్లతో ఆరోగ్య పథకం ప్రారంభిస్తామని తెలిపారు. ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో 2.24 లక్షల కోట్లు ఆరోగ్య రంగంలో వెచ్చిస్తామని చెప్పారు.

నూతన దశాబ్ధంలో తొలి బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్‌లో ఆమె ప్రవేశపెడుతున్నారు. కొవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ విధించకుంటే భారత్‌ భారీగా నష్టపోయి ఉండేదని 2021-22 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.కరోనా మహ్మరితో పోరాడుతూ అత్యవసర రంగంలో పనిచేసిన వారందరూ ప్రాణాలొడ్డి పనిచేశారని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని పరిస్ధితులు ఎదురయ్యాయని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం 27 లక్షల కోట్ల ప్యాకేజ్‌లను ప్రకటించిందని చెప్పారు. కరోనా కట్టడికి భారత్‌లో రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వంద దేశాలకు భారత్‌ టీకాలను ఎగుమతి చేస్తోందని వివరించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు.