కరోనాతో ఆదాయలు తగ్గాయి. ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయింది. కొత్త ఉద్యోగాలు లేవు. ఎగుమతులు కూడా పెద్దగా పెరగలేదు. అయితే , గత కొన్ని రోజులుగా మళ్లీ కొంచెం కొంచెం గా సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. ఈ సమయంలోనే కేంద్రం తాజాగా 2021 పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు స్టాక్ మర్కెట్స్ జోరు బాగా కనిపించింది. బడ్జెట్ పెట్టిన తర్వాత వరుసగా రెండో రోజు కూడా దలాల్ స్ట్రీట్‌లో లాభాల హవా కొనసాగుతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూచీలు రికార్డు దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 50వేల మార్క్‌ని అధిగమించింది. ప్రస్తుతం 1529 పాయింట్ల లాభంతో 50,128 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు ఎగిసి 14721 వద్ద, 14550 స్థాయిని దాటేసింది. బ్యాంకింగ్ షేర్ల లాభాలతో అటు బ్యాంక్ నిఫ్టీ 4 శాతానికి పైగా పెరిగింది.
టాటామోటార్స్, 9 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి 6 306.90 ను తాకింది.టెక్ మహీంద్రా, ఐసీఐసీఐఐ బ్యాంక్, యూపీఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో కూడా 3-8 శాతం లాభాలతోట్రేడ్ అవుతున్నాయి.