Poison Cocaine: కల్తీ కొకైన్ వల్ల 20 మంది మృతి..ప్రాణాపాయ స్థితిలో 75మంది..!

Poison Cocaine:పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన ప్రజలు వారి రోజు వారి అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. అనేక కొత్త అలవాట్లను అలవరచుకుంటున్నారు. సిగరెట్టు,గంజాయి, మద్యం సేవించడం ఇప్పుడు అనేక మందికి ఉన్న అలవాటు. అయితే వీటిని అరికట్టడానికి పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసేవారిని మాత్రమే కాకుండా డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు.
కోకైన్ లాంటివి మత్తు ఇవ్వటమే కాకుండా ఏమైనా తేడాలు వస్థే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్తితి ఉంది. ఇటువంటి కొకైన్ లో విష పదార్ధాలు కలిస్తే ఎలా ఉంటుంది.

ఇలాంటి సంఘటన అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్ లో జరిగింది. కల్తీ కొకైన్ తీసుకొని 20 మంది మరణించారు, 75 మందికి పైగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కొకైన్ లో విష పూరిత పదార్థాలు కలవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసుల ప్రాథమిక అంచనాలో తేలింది. బ్యూనస్‌ ఎయిర్స్ ప్రావిన్స్ లోని చుట్టుపక్కల 8 పట్టణాలలో ఈ కల్తీ కొకైన్ సప్లై జరిగిందని, అందువల్లనే 20 మంది చనిపోయారు, 75 మంది పరిస్తితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 75 మంది పరిస్తితి కూడా ఎంతో దారుణంగా ఉందని, మరణాల రేటు ఎక్కువ అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు.

కొకైన్ వినియోగించే దేశాలలో అమెరికా, ఉరుగ్వే తర్వాత అర్జెంటీనా మూడవ స్థానంలో ఉంది. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న దేశాల మీద 2019లో విడుదలైన ఒక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అర్జెంటీనా ప్రపంచంలోనే కొకైన్ వినియోగంలో మూడో స్థానంలో ఉంది అంటే అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య ఎంత ఉందో ఒక అంచనాకు రావచ్చు. కొకైన్ వినియోగాన్ని తగ్గించడానికి అర్జెంటినా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని సప్లై చేస్తున్న ముఠాలు ఏదో ఒక దొంగ దారిలో వినియోగిస్తున్న వ్యక్తులకు చేరవేస్తున్నాయి. దీంతో అక్కడ డ్రక్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్స్‌ పరిసర పట్టణాలలో డ్రగ్స్ సప్లై చేసే ముఠాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ముఠాల మధ్య ఏదైనా గొడవ జరగడం వల్ల కొకైన్ కల్తీ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. కొకైన్ వల్ల అస్వస్థతకు గురైన వారి శాంపుల్స్ లాబ్ కి పంపి పరీక్షిస్తున్నారు. లాబ్ నుండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని ప్రావిన్షియల్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ సెర్జియో బెర్నీ తెలిపారు. హర్లింగ్‌హామ్, శాన్ మార్టిన్, ట్రెస్ డి ఫెబ్రెరో పట్టణాల్లోనే కల్తీ కొకైన్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించాయి అని ఆయన తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఆయన తెలిపారు.