ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా రోడ్డు ప్రమాదాలు గురించే కనిపిస్తూనే ఉంది. కొన్ని రోడ్డు ప్రమాదాలు ఎలా ఉన్నాయి అంటే చనిపోయిన వ్యక్తి ఎవరో తమకు టుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేని విధంగా అందులో అత్యంత దారుణంగా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే 18 మంది మృతి చెందారు.
మరోఆరుగురు గాయపడగా వారిని దగ్గరలోని ఆసుపత్రికి చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లా వద్ద నుంచి బంధువులు అంత్యక్రియలకు వెళుతుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్రక్కును బాధితులు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే 18 మంది మృతి చెందగా, మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 22 మందికి పైగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే దట్టంగా కమ్ముకున్న పొగమంచు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ దారుణమైన ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధర్జర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకేసారి 18 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరమని, ఆయా కుటుంబాలకు అతను ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఆలయ బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదుకోవాలని అతను ట్విట్టర్లో కోరారు.