వైసీపీకి మరో రెండు బేతాళ ప్రశ్నలు వేసిన రఘురామరాజు 

Raghurama Krishnama Raju
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వైఖరి వైసీపీకి తలనొప్పిగా పరిణమించిన సంగతి తెలిసిందే.  పార్టీలోని ప్రతి అంశాన్ని పార్టీ కోణం నుండి కాకుండా సొంత కోణం నుండి చూస్తూ విమర్శలు చేస్తూ వచ్చిన రఘురామరాజును వైఎస్ జగన్ మొదట్లో చూసీ చూడనట్టు వదిలేసినా మెల్లగా సొంత పార్టీ లీడర్లు, అది కూడా రఘురామరాజు సామాజిక వర్గానికి చెందిన వారితోనే విమర్శలు చేయించారు.  దీంతో రాఘురామరాజులో ఫైర్  ఇంకాస్త ఎక్కువైంది.  మునుపు కొంచెం వెనకా ముందు చూసి మాట్లాడుతూ వచ్చిన ఆయన ప్రజెంట్ ఎవ్వరినీ కేర్ చేయట్లేదు.  ఫలితంగా నరసాపురంలో ఆయన దిష్టిబొమ్మలు దగ్ధమయ్యాయి.  ఎంపీ రక్షణ కావాలని నేరుగా పోలీస్ విభాగానికి లేఖ రాశారు. 
 
 
ఈ పరిణామాలతో పార్టీకి, రాఘురామరాజుకు మధ్య వ్యవహారం పూర్తిగా చెడిపోయింది.  దీంతో రాఘురామరాజు ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకుని అధికార పార్టీని ఇబ్బందుల్లోకి తోయాలని చూస్తున్నారు.  ప్రజెంట్ అధికార పక్షం గట్టిగా మాట్లాడుతున్న, పోరాడుతున్న నిమ్మగడ్డ అంశంలో వేలు పెట్టిన ఆయన అసలు నిమ్మగడ్డ రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ పదవిలో ఉన్నారో లేదో ప్రభుత్వం చెప్పాలి.  ఒకవేళ ఆయన పదవిలో ఉంటే కామినేని, సుజనా చౌదరిలను కలవడం తప్పే అవుతుంది.  ఒకవేళ పదవిలో లేకపోతే ఎలాంటి తప్పూ ఉండదు.  అది ఆయన సొంత విషయం అవుతుంది.  కాబట్టి ముందు ఆయనలో పదవిలో ఉన్నారో లేదో సర్కార్ క్లారిటీ ఇవ్వాలని పెద్ద లాజిక్ లాగారు. 
 
 
ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు.  మరి ఎంపీని, ప్రభుత్వ మనిషిని అయిన తనను ఎకంగా బెదిరిస్తున్నారని, దాడులు చేస్తామని, కాళ్లు, చేతులు తీస్తామని అంటున్నారని, మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థంకావడంలేదని అన్నారు.  మరి వ్యతిరేక పోస్టులు పెడితేనే సీఐడీ చేత అరెస్టులు చేయిస్తున్న సర్కార్ సొంత ఎంపీని బెదిరిస్తుంటే ఎందుకు మౌనంగా ఉందో వారే వివరణ ఇవ్వాలి.  మొత్తానికి రఘుటామరాజు వైసీపీ యొక్క రెండు ప్రధానమైన లక్ష్యాల మీద తెలివైన ప్రశ్నలు సంధించి బాగానే ఇరుకునపెట్టారు.  మరి ఈ ప్రశ్నలకు వైసీపీ నేతలు  సమాధానం ఇస్తారో లేకపోతే దాటవేస్తారో చూడాలి.