తమిళ నాట స్టార్ హీరో ఆయునటువంటి విజయ్ దళపతి మన తెలుగులో ఫస్ట్ టైం ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్ లో 66వ సినిమాగా దర్శకుడు వంశీ పైడిపల్లి తో చేస్తున్నాడు. తన గత సినిమాలతో మన తెలుగు మార్కెట్ లో కూడా మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. దీనితో డైరెక్ట్ తెలుగులో సినిమా ఒకే చేసాడు. అయితే ఈ సినిమా లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే మరి ఈమెతో పాటుగా మరో యంగ్ బ్యూటీ కూడా ఈ చిత్రంలో నటిస్తోంది అని ఊహాగానాలు వచ్చాయి. అయితే నేషనల్ మీడియా కి చెందిన వారు మెహ్రీన్ కౌర్ కూడా ఆన్ బోర్డ్ లోకి వచ్చినట్లు అంటున్నారు. కానీ మన తెలుగు సినిమాకి చెందిన పి ఆర్ లు మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని కొట్టి పడేస్తున్నారు. ఈ లెక్కన మన తెలుగు మీడియా సమాచారం ప్రకారం అయితే ఈ హీరోయిన్ లేదని కన్ఫర్మ్ చేశారు.
మరి ఇంకా ఈ సినిమాలో జయసుధ శరత్ కుమార్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. అలాగే ఈ సినిమాని ఎలా అయినా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు.