రోజా గ‌న్ మెన్ కి క‌రోనా..ఆమె అభిమానుల్లో టెన్ష‌న్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌రుస‌గా ప్ర‌జా ప్ర‌తినిధులు క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైర‌స్ సోకి క్వారంటైన్ లో ఉన్నారు. అంత‌కు ముందే ఆ ఎమ్మెల్యేల గ‌న్ మెన్లు, డ్రైవ‌ర్లు, వ్య‌క్తిగ‌త సిబ్బందికి మ‌హ‌మ్మారి సోక‌డంతో నాయ‌కులు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు వైర‌స్ బారిన ప‌డ‌టం మ‌రింత క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. అటు సీఎం క్యాప్ కార్యాల‌యానికి క‌రోనా సోకింది. ప‌ల‌వురి సిబ్బంది కి వైర‌స్ సోక‌డంతో తాత్క‌లికంగా మూసివేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగిది.  తాజాగా వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ రోజా గ‌న్ మెన్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడు.

ప్ర‌స్తుతం ఆయ‌న్ని తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. దీంతో రోజా స‌హా ఆ కుటుంబంలో అభిమానుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇటీవ‌లే రోజా ఏమాత్రం కొవిడ్ సూచ‌న‌లు ప‌ట్టించుకోకుండా కొత్త అంబులెన్స్ ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఓ అంబులెన్స్ ఎక్కి స్వ‌యంగా డ్రైవింగ్ చేసారు. ఆ స‌మ‌యంలో రోజా ముక్కుకి మాస్క్ గానీ, చేతికి గ్లౌజ్ గానీ వేసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జా ప్ర‌తినిధి అయి ఉండి, అది ప్ర‌భుత్వంలో కీల‌క వ్య‌క్తి అయిన రోజా బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. తాజాగా ఆమె గ‌న్ మెన్ కే క‌రోనా సోడంతో అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఘ‌న‌ట‌తో రోజా కొద్ది రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండ‌టం మంచిద‌ని ప‌లువురు సూచిస్తున్నారు.

రోజా రాజీకాయాల‌లోకి రాక‌ముందు ఓ సినిమా న‌టి. జ‌బ‌ర్ద‌స్త్ షోకు న్యాయ నిర్ణేత‌. ఈ నేప‌థ్యంలో ఆమెకు చాలా మంది అభిమానులు ఏర్ప‌డ్డారు. ఇప్పుడా ఆ అభిమాన వ‌ర్గంలో టెన్ష‌న్ మొద‌లైంది. అయితే క‌రోనా సోకిన ఆ గ‌న్ మెన్ గ‌త 10 రోజులుగా విధుల‌కు రావ‌డం లేద‌ని, కాబ‌ట్టి రోజా అండ్ ఫ్యామిలీ టెన్ష‌న్ ప‌డాల్సినంత ప‌నిలేద‌ని టాక్ వినిపిస్తోంది. వైర‌స్ ఇటీవ‌ల గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంద‌ని డబ్ల్యూ హెచ్ ఓ కూడా అనుమానం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.