తెలంగాణలో కొద్దిరోజలు క్రితం వరకు కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితమవుతున్నాయి, ఇక తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడం ఖాయం అని సంబర పడ్డాం. కానీ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ నుంచి వందల్లో నమోదవుతుంటే ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని గాంధీ ఆస్ప్రతిలో వైద్యులు, వైద్య సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆస్పత్రి పడకల సామర్థ్యం ఇప్పటికే దాదాపు నిండిపోయినట్లు సమాచారం. ఆస్పత్రిలో సుమారుగా 1,160 పడకలుండగా కరోనా తీవ్రత దృష్ట్యా 400 మందిని వైద్య కళాశాలలో అదనంగా సర్దినట్లు తెలుస్తోంది. నెల నుంచి కరోనా కేసుల పెడటంతో కొన్నినెలలుగా నిరంతరం సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి తలకు మించిన భారంగా మారుతుంది.
మరోపక్క నిమ్స్ లో 20మందికి వైద్య కరోనా సోకింది. దీంతో నిమ్స్ లో ఓపీ, రోగుల అడ్మిట్ లను కొన్నిరోజులు పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. నిమ్స్‌లో కార్డియాలజీ విభాగంలో ఓ రోగికి కరోనా సోకిందని సమాచారం. అతడి నుంచి ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తించడంతో ఆస్పత్రిలో నియంత్రణ చర్యలు ప్రారంభించినా ఇంకా పరిస్థితి పూర్తిగా మారలేదు. ఆస్పత్రిలో వైరస్ వ్యాప్తిని నివారించేందుకు శానిటైజేషన్ వంటి ప్రకియ చేపట్టారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జి చేసి పంపించారు. సచివాలయం పరిస్థితి కూడా సేమ్ ఇంతే. మొత్తానికి మహానగరంలో కరోనా విజృంభణ ఎక్కువయింది.